
మై టీడీపీ యాప్‌లో సరికొత్త రికార్డు.. 10 లక్షల డౌన్‌లోలోడ్స్!
తెలుగుదేశం పార్టీ రూపొందించిన మై టీడీపీ (MyTDP) యాప్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 10 లక్షల డౌన్‌లోలోడ్స్ సాధించడం పార్టీ ప్రయాణంలో అరుదైన మైలురాయిగా నిలిచిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు నిర్వహించే కార్యక్రమాల వివరాలను మై టీడీపీ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. యాప్ ద్వారా ఇచ్చే టాస్క్‌ల ఆధారంగా కార్యకర్తల పనితీరును గుర్తించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.