
సామాన్యుడికి సీఎం చంద్రబాబు భారీ ఊరట!
సామాన్యులపై నిత్యావసర ధరల భారం పడకూడదని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.100కే, లీటర్ పామాయిల్ రూ.125కే విక్రయించాలని ఆదేశించారు. ధరల నియంత్రణ కేంద్రాలను 286 నుంచి 500కు పెంచాలని, కూరగాయల ధరలను కూడా నియంత్రించాలని అధికారులకు సూచించారు.