
జగన్ ఇలాకాలో టీడీపీ జోరు.. సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం!
వైఎస్ జగన్ సొంత గ్రామంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు పంచాయతీలో టీడీపీ అభ్యర్థి కొత్తరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల తర్వాత జగన్ సొంతూరిలో టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2,269 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో వైసీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకపోవడంతో అనిల్ కుమార్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.