
ప్లేట్లు, గ్లాసులు ఇచ్చారు.. భోజనం ఏదీ? అధికారుల ఆవేదన!
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గురువారం జరగనున్న MPTC, ZPTC ఎన్నికల విధుల కోసం అధికారులు చేరుకున్నారు. అయితే ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లేట్లు, గ్లాసులు ఇచ్చి భోజనం ఎక్కడని ప్రశ్నించారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చి బ్యాలెట్ బాక్సుల పనులు చూసుకుంటున్నామని తెలిపారు. 50 ఏళ్లు దాటినవారు, బీపీ సమస్యలున్న ఉద్యోగులు కూడా ఉన్నారని, భోజన ఏర్పాట్లు లేకపోతే ఇంటి నుంచే తెచ్చుకునేవాళ్లమని అసహనం వ్యక్తం చేశారు.