
ప్రకాశం పంచాయతీ ఎన్నికల్లో హైటెన్షన్.. బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు, ఇంకు!
ప్రకాశం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద ఉల్లగల్లులో రిగ్గింగ్ ఆరోపణలు, బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లిన ఘటనతో పోలింగ్ నిలిచిపోయింది. తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు, ఇంకు పోయడంతో కలకలం రేగింది. వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అధికారులు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీపోలింగ్‌పై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.