
బియ్యం ధరలకు బ్రేక్.. తగ్గిన ధరలు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో బియ్యం ధరలకు బ్రేక్.. మిల్లర్లు, వ్యాపారులకు కొత్త నిబంధనలు. ఏపీలో బియ్యం ధరలు, నిల్వలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మిల్లర్లు, వ్యాపారులకు స్టాక్ పరిమితులు విధిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ ఎంటీయూ బియ్యం కిలో రూ.47గా నిర్ణయించగా, ఇతర రకాల ధరలు రూ.66 నుంచి రూ.82 వరకు ఉన్నాయి. స్టాక్ వివరాలను ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు దుకాణాల్లో ధరల పట్టికలు ప్రదర్శించాలని ఆదేశించింది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే జరిమానాలు విధించనుంది.