
దర్శిలో ఘనంగా మాజీ మున్సిపల్ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం
దర్శి పురపాలక సంఘం 2021–2026 పాలకవర్గ ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మాజీ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నూతన చైర్మన్ దారం సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, కమిషనర్ కె. అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.