
జనసేనలో అనంత శ్రీరాం తల్లిదండ్రులు.. సర్పంచ్ బరిలో తల్లి ఉమారాణి!
ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరాం కుటుంబంలో రాజకీయ సందడి మొదలైంది. ఆయన తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారు. భీమవరంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. తన తల్లి ఉమారాణి దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అనంత శ్రీరాం వెల్లడించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని పార్టీల మద్దతుతో ఉమారాణి ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.