
జర్నలిస్టులను ఘనంగా సన్మానించిన భీమ్ ఆర్మీ..
జాతీయ జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని ఆర్ఎంబి న్యూస్ 16 భీమ్ ఆర్మీ కార్యాలయంలో పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ రావణ్ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలతో గౌరవించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు.