
నిధుల కోసం ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేదు
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మురసు తీవ్ర తుపాను పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కదులుతోంది. ( తీవ్ర తుఫానుగా ‘మురసు’(Cyclone Murasu) ఒంగోలుకు Alert) ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న సమాచారంతో నెల్లూరు, కావలి, ప్రకాశం, మచిలీపట్నం తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నెల్లూరు – నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం!

జహీరాబాద్ ఎంపీడీవోగా వెంకట్ రెడ్డి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. జహీరాబాద్ ఎంపీడీఓ గా పనిచేసిన మహేందర్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వెంకట్ రెడ్డి నియమితులయ్యారు ఇంతకుముందు వెంకట్ రెడ్డి కోహిర్ ఎంపీవో గా పని చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎదురు తిరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాప్తాడులో జరిగిన ఘటన నేపథ్యంలో విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. దీంతో 20 మంది మానసిక నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టెన్త్-ఏ తరగతిలోని 32 మంది విద్యార్థులతో పాటు 8, 9, 10వ తరగతుల బాలికల ఇళ్లకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పిల్లల్లో భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసం పెంచి తిరిగి పాఠశాలకు వెళ్లేలా సహకరిస్తున్నారు.

కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా మరణించగా, 8 ప్రావిన్సుల్లో 10,300కు పైగా కేసులు నమోదయ్యాయి. మే నెలలో మొదలైన ఈ వ్యాధి ఆగస్టు నాటికి దేశంలో అత్యంత ప్రాణాంతకంగా మారినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరణాల రేటు 48.6 శాతంగా ఉంది. కెన్యా, నైజీరియా, ఉగాండాలోనూ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.

ప్రకాశం జిల్లాలో నేడు మూడు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవితో పాటు చీమకుర్తి, అద్దంకిలో ఎన్నికల పోరు కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందుకోసం అధికారులు 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 2,284 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

చీమకుర్తి మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.107 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణంతో పాటు పట్టణ పరిధిలోని 16 చెరువులను పునరుద్ధరించనున్నారు. అలాగే విద్యార్థుల సంక్షేమం కోసం రూ.30 కోట్లతో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి ఈ పనులు కీలకంగా మారనున్నాయి.

చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సిద్ధా సుధాకర్‌కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. చీమకుర్తి భవిష్యత్తు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటున్నారు.

జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్అక్టోబర్ 26: పట్టణంలోని శ్రీ మంగళ గౌరీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప, ఆలయ అర్చకులు సంగమేశ్వర్ స్వామి తెలిపారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో NDA అభ్యర్థి సిద్ధా సుధాకర్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సుధాకర్‌కు మద్దతు తెలిపారు. ఎన్ఎస్పీ కాలనీ నుంచి హరిహర క్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా నిలుస్తున్నాయి.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా షంషీర్ అలీ నీ ఎన్నుకోవాల్సిం దే. జహీరాబాద్ సామాజిక తెలంగాణ ప్రతినిధి అక్టోబర్ 27 జహీరాబాద్ నియోజకవర్గం లోని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చంశీరలి ని యమించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈనాయక్ పటేల్ మొహమ్మద్ నహీముద్దీన్, మోహిన్ స్వీట్‌హౌస్ కోహిర్, అబ్దుల్ ముక్తదీర్ , అబ్దుల్ ఖయ్యూం డి డి,దశరథ్ రాథోడ్ సిద్దాపూర్ తాండ, చందు నాయక్ గొడిగార్‌పల్లి తండ, ప్రేమ్ సింగ్, అబ్దుల్ జబ్బర్ బానిక , అబ్దుల్ ఖయ్యూం , అబ్దుల్ లయకు

బంగాళాఖాతంలో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ నెలాఖరు నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొననున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, అర్బన్ తుఫాన్ తీరం దాటినట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఏపీ సీఎం చంద్రబాబు తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఉల్లి, పసుపు, పొగాకు, కేజీ చొప్పున పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు. ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన వారికి కూడా సాయం అందుతుంది. స్పెషల్ అసిస్టెన్స్ కింద అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.1,000 చొప్పున అందించనున్నట్లు సమాచారం. ఇళ్లలో నీరు చేరిన వారికి 25kg బియ్యం, చనిపోయిన వారికి రూ.5వేలు, ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అయితే రూ.10వేలు, పశువులు దెబ్బతింటే రూ.25K. టోటల్ డ్యామేజీకి రూ.3వేలు, త్రీలింక్ రూ.10వేలు ఇస్తాం.

ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. 2–4 గంటల మధ్య కీలక పరిణామం!

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో భారం ఎదురవుతోంది.

ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, కాలనీల ప్రజలను అప్రమత్తం చేస్తూ, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.

అద్దంకి మండలం తిమ్మాయపాలెం సమీపంలో ఇటుక బట్టీల వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కూలీల గుడిసెల్లో మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన కూలీలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో దుస్తులు, సామగ్రి కాలిపోవడంతో పాటు సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి సంబంధించిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంకపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆమెను ఎన్నికల విధులతో పాటు ఇతర విధుల నుంచి కూడా తప్పించాలని స్పష్టం చేసింది.ఘటనకు సంబంధించిన మీడియా కథనాలు, వీడియోలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించాలని SEC ఆదేశించింది.

జహీరాబాద్ పట్టణంలోని ఇండస్ట్రీ పార్క్ వెళ్లే రోడ్డు పై ఇస్తారని ఇష్టానుసారంగా నిలవడంతో ప్రభుత్వ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్కు రోడ్డు వెళ్లే రోడ్డు కుంట ఇండస్ట్రియల్ తో పాటు అగ్నిమాపక కేంద్రం పార్ష్ ఆఫీస్ అటు సైడ్ ఉన్నాయి. అయితే మెయిన్ రోడ్డు ఇండస్ట్రియల్ పార్క్ కి వెళ్లే మార్గంలో రోడ్డుపై ఫుట్‌పాత్ వ్యాపారాలు ఉండటంతో వచ్చిన వాహనాలు రోడ్డుపై నిలబడుతుంది.

AP: స్థానిక ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ప్రజలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు సూచించిన గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తారా? లేక యథావిధిగా ప్రక్రియను కొనసాగిస్తారా? అనే చర్చ సాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఎన్నికల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇవాళ రాత్రిలోపు SEC నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

22-10-2026 విజయదశమి(దసరా)పండుగ సందర్బంగా ఈ రోజు హైదరాబాద్ లో ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం గారు,
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శివకుమార్, మేఘనాథ్,తదితరులు ఉన్నారు.

2024 ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలను కూటమి నేతలు గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని SEC (రాష్ట్ర ఎన్నికల సంఘం)కు స్పష్టం చేశారు. ఎన్నికల సంస్కరణలు, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా SEC మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ SEC ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.తొలుత కొన్ని స్థానాల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం మొత్తం 100 స్థానాల్లో ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు SEC తెలిపింది. ఈ నెల 25 వరకు ఎన్నికల ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Notification delivery works only after a push provider is configured and users have allowed notifications. It cannot be delivered to users who have not subscribed or whose device/browser blocks notifications.
Login / Signup అయిన వెంటనే మీ News Card సృష్టించి ప్రచురించవచ్చు.
📭 No articles yet.
Click "Create New Article" above to add your first long-form article.
No banners yet.
No ads yet.
No shorts yet.