⏳ Generating...

🔐 Admin Login

RMB NEWS - తెలుగు షార్ట్ న్యూస్ | RMB Live News

📺 RMB News YouTube Shorts

Nara lokesh
nadendla
cbn
lokesh
Nani
Nani Paradise
RMB News
Irumudi Director Shiva Nirvana
NBK111 New Movie DADA 2026
AP CM Chandrababu Strong Warning leaders
మాచర్ల నియోజకవర్గంలో  వాటర్ గ్రిడ్ పనులకు  శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

మాచర్ల నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

| 🌐 Telugu | 📍 మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రాయవరం జంక్షన్ నుండి కారంపూడి వరకు 1300 mm వాటర్ పైప్ లైన్ నిర్మాణం కానుంది.భూమి పూజ: కారంపూడి రోడ్డులోని MSME పార్క్ వద్ద ఈరోజు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ప్రాజెక్ట్ ఈ పనులు జల్ జీవన్ మిషన్ నిధులతో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఈ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించారు.

👁️ 132
తేరాల సిద్ధేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి జూలకంటి బ్రహ్మానందరెడ్డి హామీ
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

తేరాల సిద్ధేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి జూలకంటి బ్రహ్మానందరెడ్డి హామీ

| 🌐 Telugu | 📍 దుర్గి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్

దుర్గి మండలం తేరాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ సిద్ధేశ్వరస్వామి వారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల వినతుల మేరకు ఆలయ అభివృద్ధికి అవసరమైన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో నిధులు మంజూరు చేయించి, ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

👁️ 77
మేము చేసింది తప్పే.. క్షమించండి! YCP నేతలు..
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

మేము చేసింది తప్పే.. క్షమించండి! YCP నేతలు..

| 🌐 Telugu | 📍 Mundlamur, Prakasam, ఆంధ్రప్రదేశ్

ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో వైఎస్ విగ్రహం వద్ద చోటుచేసుకున్న పరిణామం హాట్ టాపిక్‌గా మారింది. గణనాథుని శోభాయాత్రలో గులాం విగ్రహంపై పడిన ఘటనకు సంబంధించి టీడీపీ నాయకుడు కంచుమాటి నాగేశ్వరరావుతో వివాదం నెలకొన్నట్లు సమాచారం. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం. తాజాగా వైఎస్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు చేతులెత్తి నమస్కరిస్తూ మేము చేసింది తప్పే క్షమించండి అంటూ క్షమాపణలు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

👁️ 93
పల్లె పండుగ 3.0.. గ్రామాల్లో ₹11 వేల కోట్ల పనులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

పల్లె పండుగ 3.0.. గ్రామాల్లో ₹11 వేల కోట్ల పనులు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 29న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹11 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటనలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

👁️ 50
కోతులు.. కుక్కలు. తో గ్రామ వాసులు తిప్పలు     పట్టించుకోని అధికారులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

కోతులు.. కుక్కలు. తో గ్రామ వాసులు తిప్పలు పట్టించుకోని అధికారులు

| 🌐 Telugu | 📍 Chinthalapalem, సూర్యాపేట, తెలంగాణ

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గాంధీనగర్ తండా లో కోతుల బెడద ప్రజల నిత్యజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. వందల సంఖ్యలో గుంపులుగా సంచరిస్తున్న కోతులు వీధులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉదయం ఇంటి తలుపు తెరవాలన్నా, సాయంత్రం ఇంటికి చేరాలన్నా ముందుగా బయట కోతులు ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నారుల బడిబాటకు అడ్డుగా కోతులు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తల్లిదండ్రులు లేదా పెద్దలతో కలిసి మాత్రమే బయటకు వస్తున్నారు. ఒంటరిగా నడిస్తే కోతులు వెంటపడతాయనే భయంతో పిల్లలు వణికిపోతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపడానికే భయపడుతున్నామని చెబుతున్నారు.

👁️ 138
అహ్మదాబాద్‌లో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీలు.. ఏపీలోకి భారీ పెట్టుబడులే టార్గెట్!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

అహ్మదాబాద్‌లో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీలు.. ఏపీలోకి భారీ పెట్టుబడులే టార్గెట్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

అహ్మదాబాద్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్ ఏపీకి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. ప్రముఖ పారిశ్రామిక వర్గాల ప్రతినిధులతో వరుసగా సమావేశమై రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఇంధనం, తయారీ, టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచేలా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భేటీలు కొనసాగాయి.

👁️ 119
బ్యాంకుల సమ్మె.. SBI కీలక ప్రకటన!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

బ్యాంకుల సమ్మె.. SBI కీలక ప్రకటన!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె నేపథ్యంలో SBI ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. ఈ మూడు రోజుల్లో ATM లావాదేవీలపై అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. సాధారణంగా నెలకు 5 ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.10తో పాటు GST వసూలు చేస్తారు. అయితే సమ్మె కారణంగా ఈ ఛార్జీలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు SBI వెల్లడించింది.

👁️ 61
రెంటచింతలలో ఘనంగా ఒడి బియ్యం వేడుకలో: హాజరైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

రెంటచింతలలో ఘనంగా ఒడి బియ్యం వేడుకలో: హాజరైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల,,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బత్తుల లింగయ్య కుమార్తె దేవి శ్రీలక్ష్మి పుష్పాలంకరణ మహోత్సవం వైభవంగా జరిగింది.ముఖ్య అతిథి: పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గొట్టం బ్రహ్మారెడ్డి, ఏలూరి శౌరిరెడ్డి, నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు .

👁️ 31
రోడ్డు ప్రమాదంలో  పుట్లూరి చెన్నారెడ్డి మృతి,
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

రోడ్డు ప్రమాదంలో పుట్లూరి చెన్నారెడ్డి మృతి,

| 🌐 Telugu | 📍 మాచర్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: మాచర్ల పట్టణంలోని 22వ వార్డుకు చెందిన పుట్లూరి చెన్నారెడ్డి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పాలవాయి జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నారెడ్డి మృతి విషయం తెలుసుకున్న జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తీవ్ర సానుభూతిని తెలియజేశారు.

👁️ 22
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం.. ట్యాంక్‌బండ్‌కు పోటెత్తిన భక్తులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం.. ట్యాంక్‌బండ్‌కు పోటెత్తిన భక్తులు

| 🌐 Telugu | 📍 హైదరాబాద్‌, తెలంగాణ

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్‌-4 వద్ద పంచముఖ సంకటహర మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేశారు. మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. సెక్రటేరియట్ సౌత్‌ఈస్ట్ మార్గంలోనూ భక్తుల రద్దీ కనిపించింది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

👁️ 71
వినాయక నిమర్జనానికి విస్తృత ఏర్పాట్లు ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి 25
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

వినాయక నిమర్జనానికి విస్తృత ఏర్పాట్లు ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి 25

| 🌐 Telugu | 📍 Zhyerabad, Sangareddy, తెలంగాణ

వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
-- నారింజ బ్యారేజ్ ను సందర్శించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
జహీరాబాద్, సెప్టెంబర్ 24:
జహీరాబాద్ మండలం కొత్తూరు (బి ) నారింజ బ్యారేజ్ లో వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రోజూ నిమజ్జనానికి చివరి రోజూ కావడంతో ఏర్పాట్లను పరిశీలించడానికి ఓ వైపు అధికారులు, మరో వైపు ప్రజా ప్రతినిధులు నారింజ బ్యారేజ్ ను సందర్శించారు. నిమజ్జనానికి గాను అవసరమైనంత వరకు నీటిని వదలాలని నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జహీరాబాద్ మునిసిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్, కమీషనర్ ప్రభాకర్, మాజీ మునిసిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, సార్వజనిక్ కమిటీ చైర్మన్

👁️ 54
VIDEO
చిన్నారుల కన్నీటికి లోకేశ్ స్పందన.. వెంటనే అధికార యంత్రాంగం కదలిక! 🙏❤️
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

చిన్నారుల కన్నీటికి లోకేశ్ స్పందన.. వెంటనే అధికార యంత్రాంగం కదలిక! 🙏❤️

| 🌐 Telugu | 📍 రేణిగుంట, Thirupati, ఆంధ్రప్రదేశ్

రేణిగుంట మండలం కరకంబాడి శ్రీనివాసపురానికి చెందిన చిన్నారులు P. యశ్వంత్, P. అచిత తల్లిదండ్రులు ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అండగా ఎవరూ లేక చిన్నారులు పడుతున్న ఆవేదనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. “ఏ చిన్నారి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు” అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసి, తిరుపతి కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కోరారు. చిన్నారుల కోసం తక్షణమే స్పందించిన లోకేశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

👁️ 33
ఏపీలో భారీ వర్షాలు...మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

ఏపీలో భారీ వర్షాలు...మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపై కొనసాగుతోంది. ఇది పార్వతీపురానికి 60 కి.మీ., ఒడిశాలోని భవానీపట్నానికి 90 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు SDMA తెలిపింది. రాబోయే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

👁️ 28
ఓవర్‌టేక్ ప్రయత్నంలో  ఘోర  ప్రమాదం, ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది,
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

ఓవర్‌టేక్ ప్రయత్నంలో ఘోర ప్రమాదం, ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది,

| 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలం, పాలువాయిగేటు,టోల్ ప్లాజా సమీపంలోని (గురువారం సాయంత్రం). ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.మృతుడు: మాచర్ల పాతూరుకు చెందిన పుట్లూరు చెన్నారెడ్డి (55) అక్కడికక్కడే మరణించారు.గాయపడిన వ్యక్తి: తెలంగాణ దామరచర్లకు చెందిన భూక్యా రాజశేఖర్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. రాజశేఖర్ నాయక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.

👁️ 9
🌧️ ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.. అల్పపీడనం ప్రభావం!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

🌧️ ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.. అల్పపీడనం ప్రభావం!

| 🌐 Telugu | 📍 Prakasam, ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దర్శి, ఒంగోలు, అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ సమాచారం సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని సూచిస్తున్నారు.

👁️ 18
AP కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.22,177 కోట్ల పెట్టుబడులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

AP కేబినెట్ కీలక నిర్ణయం.. రూ.22,177 కోట్ల పెట్టుబడులు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో రూ.22,177 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 19,739 ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

👁️ 57
ఏపీలో వాయుగుండం ప్రభావం.. 3 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

ఏపీలో వాయుగుండం ప్రభావం.. 3 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం తీరం దాటడంతో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

👁️ 23
దర్శి మున్సిపల్ ఎన్నికల రేసులో ప్రముఖ విద్యావేత్త అల్లాబాషు!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

దర్శి మున్సిపల్ ఎన్నికల రేసులో ప్రముఖ విద్యావేత్త అల్లాబాషు!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, Andhra Pradesh

దర్శి మున్సిపల్ ఎన్నికల రేసులో ప్రముఖ విద్యావేత్త అల్లాబాషు పేరు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయంగా బరిలోకి దిగే అంశంపై ప్రజలు, స్థానిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దర్శి పట్టణంలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. అల్లాబాషు ఎన్నికల రేసులోకి వస్తారనే ప్రచారం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారిక ప్రకటనపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

👁️ 19
ఏపీకి తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

ఏపీకి తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

👁️ 11
డా. గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

డా. గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా

| 🌐 Telugu | 📍 Darsi, Darsi, ఆంధ్రప్రదేశ్

దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఊడిగ నాగయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టీడీపీ సభ్యత్వం ఉండటంతో పార్టీ ప్రమాద బీమా కింద ఆయన కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. డా. గొట్టిపాటి లక్ష్మీ, దర్శి టీడీపీ ఇన్‌చార్జ్, డా. కడియాల లలిత్ సాగర్ కలిసి కుటుంబాన్ని పరామర్శించి చెక్కును అందజేశారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

👁️ 60
దర్శిలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులు.. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

దర్శిలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులు.. వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు

| 🌐 Telugu | 📍 Darsi, Darsi, ఆంధ్రప్రదేశ్

దర్శి పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులను సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా దర్శి మున్సిపల్ పరిధిలో సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, స్ట్రీట్ లైటింగ్, పార్కులు, సీవరేజ్ పనులు చేపట్టనున్నారు.

👁️ 54
VIDEO
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

మన్యం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల జలమయం..వీడియో

| 🌐 Telugu | 📍 మన్యం, మన్యం, ఆంధ్రప్రదేశ్

మన్యం జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో ప్రభుత్వ పాఠశాల జలమయంగా మారింది. వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. పాఠశాల పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోకి కూడా నీరు చేరడంతో సోమవారం తరగతులకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి ఉంచిన బియ్యం తడిసిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. భారీ వర్షాలతో పాఠశాల ఆవరణ మొత్తం నీటితో నిండిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

👁️ 26
⛈️ దర్శిలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం.. అప్రమత్తంగా ఉండాలని సూచన
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

⛈️ దర్శిలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం.. అప్రమత్తంగా ఉండాలని సూచన

| 🌐 Telugu | 📍 Darsi, Darsi, ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా దర్శిలో ఈరోజు భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో దర్శి పట్టణం, పరిసర ప్రాంతాల్లో వర్షం తీవ్రత పెరిగింది. భారీ ఉరుములు, మెరుపులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని స్థానికులు సూచిస్తున్నారు.

👁️ 24
మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో 31 మందికి ఉచిత ట్రై స్కూటీలు
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో 31 మందికి ఉచిత ట్రై స్కూటీలు

| 🌐 Telugu | 📍 కొరిశపాడు, అద్దంకి, ఆంధ్రప్రదేశ్

మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం మేదరమెట్లలో 31 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలు అందించారు. జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. సీఎస్ఆర్ నిధులతో అందించిన ఈ వాహనాలు దివ్యాంగుల రోజువారీ ప్రయాణం, ఉపాధికి ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు అద్దంకి నియోజకవర్గంలో 202 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలు అందించారు. దివ్యాంగుల స్వావలంబన, ఆత్మగౌరవానికి అండగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

👁️ 22
ఏపీకి తుఫాన్ ముప్పు.. అల్పపీడనంతో భారీ వర్షాలు!
RMB LIVE NEWS - India's No.1 Short News AppRMB News

ఏపీకి తుఫాన్ ముప్పు.. అల్పపీడనంతో భారీ వర్షాలు!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 22న కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ తదితర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో వర్షాల తీవ్రత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

👁️ 40
📰 25 / 205