
రూ.500, రూ.1000, రూ.2000 నోట్లు రద్దు?
ముఖ్యంగా రూ.500, రూ.1000, రూ.2000 నోట్లను రద్దు చేయాలనే ఆయన ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా రూ.500, రూ.1000, రూ.2000 నోట్లను రద్దు చేయాలనే ఆయన ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన కన్వీనర్ చీకటి వంశీదేవి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆత్మీయంగా మాట్లాడి తమ మర్యాదపూర్వక భేటీని నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించాయి.

కడియాల రమేష్ జన్మదినం సందర్భంగా దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యువ నాయకుడు కడియాల లలిత్ సాగర్, కడియాల రమేష్‌లను నాయకులు ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని కడియాల రమేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం బీచ్ వద్ద శుక్రవారం కలకలం రేగింది. సముద్రం నుంచి గుర్తుతెలియని బోటు తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు బోటును పరిశీలించగా అందులో నాలుగు మృతదేహాలు కనిపించడంతో వెంటనే బయటకు తీశారు. ఈ బోటులో సుమారు 15 మంది ఉన్నట్లు స్థానిక మత్స్యకారులు వెల్లడించారు. బోటు చెన్నైకి చెందినదిగా భావిస్తున్నారు. అసలు బోటులో ఏం జరిగింది? మిగిలిన వారు ఎక్కడున్నారు? మృతుల వివరాలు ఏమిటి? అనే విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారనే చర్చకు రాప్తాడు ఘటన మరోసారి కారణమైంది. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై అత్యంత క్రూరంగా....

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గురువారం జరగనున్న MPTC, ZPTC ఎన్నికల విధుల కోసం అధికారులు చేరుకున్నారు. అయితే ఎన్నికల సిబ్బందికి భోజన ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లేట్లు, గ్లాసులు ఇచ్చి భోజనం ఎక్కడని ప్రశ్నించారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చి బ్యాలెట్ బాక్సుల పనులు చూసుకుంటున్నామని తెలిపారు. 50 ఏళ్లు దాటినవారు, బీపీ సమస్యలున్న ఉద్యోగులు కూడా ఉన్నారని, భోజన ఏర్పాట్లు లేకపోతే ఇంటి నుంచే తెచ్చుకునేవాళ్లమని అసహనం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఈ మేరకు వాయిస్ మెసేజ్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా సిబ్బంది ఇబ్బందులు పడకూడదన్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత సమాచారం అందిస్తామని తెలిపారు. అప్పటివరకు కౌంటింగ్ సిబ్బంది ఇళ్లలోనే ఉండాలని, సమాచారం అందిన తర్వాతే బయలుదేరాలని హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో గంటకు 120-160 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మురసు తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. తుపాన్ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ, గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నెల్లూరుకు 80 కి.మీ, కావలికి 80 కి.మీ, ఒంగోలుకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున సముద్రంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ముండ్లమూరు మండలం, ఈదర పంచాయతీ పరిధిలోని కొమ్మవరం గ్రామానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

మురసు తీవ్ర తుపాను పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కదులుతోంది. ( తీవ్ర తుఫానుగా ‘మురసు’(Cyclone Murasu) ఒంగోలుకు Alert) ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న సమాచారంతో నెల్లూరు, కావలి, ప్రకాశం, మచిలీపట్నం తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నెల్లూరు – నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం!

జహీరాబాద్ ఎంపీడీవోగా వెంకట్ రెడ్డి శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. జహీరాబాద్ ఎంపీడీఓ గా పనిచేసిన మహేందర్ రెడ్డి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వెంకట్ రెడ్డి నియమితులయ్యారు ఇంతకుముందు వెంకట్ రెడ్డి కోహిర్ ఎంపీవో గా పని చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎదురు తిరిగినట్లు సమాచారం. దీంతో పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాప్తాడులో జరిగిన ఘటన నేపథ్యంలో విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. దీంతో 20 మంది మానసిక నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టెన్త్-ఏ తరగతిలోని 32 మంది విద్యార్థులతో పాటు 8, 9, 10వ తరగతుల బాలికల ఇళ్లకు వెళ్లి విద్యార్థులు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పిల్లల్లో భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసం పెంచి తిరిగి పాఠశాలకు వెళ్లేలా సహకరిస్తున్నారు.

కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా మరణించగా, 8 ప్రావిన్సుల్లో 10,300కు పైగా కేసులు నమోదయ్యాయి. మే నెలలో మొదలైన ఈ వ్యాధి ఆగస్టు నాటికి దేశంలో అత్యంత ప్రాణాంతకంగా మారినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మరణాల రేటు 48.6 శాతంగా ఉంది. కెన్యా, నైజీరియా, ఉగాండాలోనూ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.

ప్రకాశం జిల్లాలో నేడు మూడు ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవితో పాటు చీమకుర్తి, అద్దంకిలో ఎన్నికల పోరు కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందుకోసం అధికారులు 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 2,284 మంది సిబ్బందిని నియమించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

చీమకుర్తి మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.107 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణంతో పాటు పట్టణ పరిధిలోని 16 చెరువులను పునరుద్ధరించనున్నారు. అలాగే విద్యార్థుల సంక్షేమం కోసం రూ.30 కోట్లతో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధికి ఈ పనులు కీలకంగా మారనున్నాయి.

చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి సిద్ధా సుధాకర్‌కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. చీమకుర్తి భవిష్యత్తు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటున్నారు.

జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్అక్టోబర్ 26: పట్టణంలోని శ్రీ మంగళ గౌరీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప, ఆలయ అర్చకులు సంగమేశ్వర్ స్వామి తెలిపారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో NDA అభ్యర్థి సిద్ధా సుధాకర్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సుధాకర్‌కు మద్దతు తెలిపారు. ఎన్ఎస్పీ కాలనీ నుంచి హరిహర క్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా నిలుస్తున్నాయి.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా షంషీర్ అలీ నీ ఎన్నుకోవాల్సిం దే. జహీరాబాద్ సామాజిక తెలంగాణ ప్రతినిధి అక్టోబర్ 27 జహీరాబాద్ నియోజకవర్గం లోని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చంశీరలి ని యమించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈనాయక్ పటేల్ మొహమ్మద్ నహీముద్దీన్, మోహిన్ స్వీట్‌హౌస్ కోహిర్, అబ్దుల్ ముక్తదీర్ , అబ్దుల్ ఖయ్యూం డి డి,దశరథ్ రాథోడ్ సిద్దాపూర్ తాండ, చందు నాయక్ గొడిగార్‌పల్లి తండ, ప్రేమ్ సింగ్, అబ్దుల్ జబ్బర్ బానిక , అబ్దుల్ ఖయ్యూం , అబ్దుల్ లయకు

బంగాళాఖాతంలో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ నెలాఖరు నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొననున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, అర్బన్ తుఫాన్ తీరం దాటినట్లు సమాచారం. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఏపీ సీఎం చంద్రబాబు తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఉల్లి, పసుపు, పొగాకు, కేజీ చొప్పున పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు. ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన వారికి కూడా సాయం అందుతుంది. స్పెషల్ అసిస్టెన్స్ కింద అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.1,000 చొప్పున అందించనున్నట్లు సమాచారం. ఇళ్లలో నీరు చేరిన వారికి 25kg బియ్యం, చనిపోయిన వారికి రూ.5వేలు, ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అయితే రూ.10వేలు, పశువులు దెబ్బతింటే రూ.25K. టోటల్ డ్యామేజీకి రూ.3వేలు, త్రీలింక్ రూ.10వేలు ఇస్తాం.
Notification delivery works only after a push provider is configured and users have allowed notifications. It cannot be delivered to users who have not subscribed or whose device/browser blocks notifications.
ఈ Master Switch ద్వారా Public Subscribe Popup, కొత్త account registrationలోని email opt-in ఎంపిక, automatic మరియు manual News Email delivery అన్నీ నియంత్రించబడతాయి. OFF చేసినా ఇప్పటికే ఉన్న user preferences తొలగించబడవు.
Published News Card లేదా Full Article ఎంచుకుని అందులోని headline, image, summary, article linkతో RMB LIVE NEWS branded HTML email పంపండి. Drafts ఈ జాబితాలో కనిపించవు.
Login / Signup అయిన వెంటనే మీ News Card సృష్టించి ప్రచురించవచ్చు.
📭 No articles yet.
Click "Create New Article" above to add your first long-form article.
No banners yet.
No ads yet.
No shorts yet.