🔐 Admin Login

RMB LIVE NEWS

RMB News Founder & CEO

RMB News Founder & CEO

RMB LIVE NEWS - India's No.1 Short News App

నేరేడు చెర్ల మండల కేంద్రంలో ఆత్మీయ కలయిక

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 నేరేడు చెర్ల, సూర్యాపేట, తెలంగాణ

నేరేడు చెర్ల మండల కేంద్రంలోని *టౌన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కోనతం సత్యనారాయణ రెడ్డి* గారిని *బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు అన్న* ఆత్మీయంగా కలిశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయంగా మాట్లాడి పలు విషయాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕐 20 Sep 2026 | 11:30 AM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

సత్రశాలలోవినాయక నిమజ్జనం, రూ, 65వేలు పలికిన లడ్డు,

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటిచింతల: నాగార్జునసాగర్ సత్రశాల టైల్ పాండ్ ఏపీ జెన్కో ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి లడ్డు వేలం పాటలో భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, గాలి వెంకటరెడ్డి రూ, 65,000 కు లడ్డును కైవాసం చేసుకున్నరు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.ఈ. కె. వెంకటరమణ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు, భక్తులు డీజే సౌండ్లు, డప్పు వాయిద్యాలతో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించి, సత్రశాలలోని కృష్ణా నదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ వేడుకలో మల్లేష్, ఆనందయ్య, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు,

🕐 19 Sep 2026 | 08:50 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మానవత చేయూత

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Chitvel, Tirupati, ఆంధ్రప్రదేశ్

చిట్వేల్ సింగనమల వీధిలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన టంగుటూరి మస్తాన్ కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేల్ శాఖ అండగా నిలిచింది. శనివారం సంస్థ తరఫున రూ.10 వేల చెక్కు, దాతల ద్వారా రూ.23 వేల నగదు కలిపి రూ.33 వేల సాయం అందించారు. దొండ్లవాగు మధుసూదన్ కుటుంబం మరో రూ.5 వేల సాయం అందించింది.

🕐 19 Sep 2026 | 08:49 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Chitvel, Tirupati, ఆంధ్రప్రదేశ్

చిట్వేల్ మండల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి ICDS ప్రాజెక్టు నోటిఫికేషన్ జారీ చేసింది. చిట్వేల్ HW (SC-1), గరుగుపల్లి (OC) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.

🕐 19 Sep 2026 | 08:45 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

ఏపీలో MPTC, ZPTC ఎన్నికలపై కీలక అప్‌డేట్

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం అధికారుల పరిశీలనతో మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లా స్థాయిలో తుది ప్రక్రియ పూర్తయ్యాక పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ కేంద్రాలపై తదుపరి అధికారిక ప్రకటన కోసం ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

🕐 19 Sep 2026 | 08:37 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

హుజూర్నగర్ 19వ వార్డులో వినాయక పూజలు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 హుజూర్నగర్, సూర్యాపేట, తెలంగాణ

హుజూర్నగర్ పట్టణంలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు అన్న పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా వినాయకుని ఆశీస్సులతో వార్డు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

🕐 19 Sep 2026 | 02:19 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

మేళ్లచెరువు మండలం సాధు తండా గ్రామంలో వినాయక పూజల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు అన్న

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 మేళ్లచెరువు, సూర్యాపేట, తెలంగాణ

మేళ్లచెరువు మండలం సాధు తండా గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.గ్రామస్తులు, యువత మరియు బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రతి వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొని, గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయకుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

🕐 19 Sep 2026 | 02:11 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

తల్లికి వందనం 2వ విడత ఎప్పుడు? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి!

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం 2వ విడత నిధుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా RTE చట్టం పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు అసలు నిధులు జమ కాలేదని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 2వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? అర్హులైన ప్రతి కుటుంబానికి డబ్బులు అందేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారిక ప్రకటన కోసం లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

🕐 18 Sep 2026 | 11:05 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

రెంటచింతల: 1,560 కొత్త పింఛన్ దరఖాస్తులు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలంలో 1,560 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో స్వరూపరాణి తెలిపారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతర కేటగిరిలు ఉన్నారు.పరిశీలన :ఈ రోజు నుండి 21 వరకు: సాధారణ అర్హత పరిశీలన22 నుండి 24 వరకు: భౌతిక, శాఖాపరమైన తనిఖీలు25, 26 తేదీల్లో: బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదంఅన్ని స్థాయిల్లో తనిఖీలు పూర్తయ్యాక ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తుంది.

🕐 18 Sep 2026 | 08:07 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

🔥 BIG BREAKING: వినాయక నిమజ్జనాల్లో DJ సౌండ్‌కు అనుమతి

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజే సౌండ్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని నారా లోకేష్ చేసిన విజ్ఞప్తిపై హోంమంత్రి అనిత స్పందించినట్లు సమాచారం. నిమజ్జన కార్యక్రమాల్లో డీజే సౌండ్ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై వినాయక ఉత్సవాల నిర్వాహకుల్లో ఆసక్తి నెలకొంది.

🕐 17 Sep 2026 | 11:03 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

పోలింగ్ బూత్ల మార్పుకు తాహశీల్దార్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

: మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎంపీటీసీ 2 కు సంబంధించి ఎల్ఎల్ఆర్ స్కూల్లో ఏర్పాటు చే సిన 36,39 పోలింగ్ బూత్లను మార్చాలని కోరుతూ టీడీపీ నేతలు ఎంపీడీవో స్వరూపరాణికి వినతిని అందచేశారు. ఈ రెండు బూత్లను వైఆర్ఎస్ హైస్కూల్లోకి మార్చాలని కోరారు. కలెక్టర్ అప్రూవల్కు పంపామని శనివారం తుది నిర్ణయం వెల్లడవుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.

🕐 17 Sep 2026 | 09:51 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు: భారీ రక్తదాన శిబిరం ఏర్పాటువేడుకలు:

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రెంటచింతల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.రక్తదాన శిబిరం: సమాజ సేవలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరానికి స్థానిక యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు.ముఖ్య అతిథులు: పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, మండల పార్టీ అధ్యక్షుడు ఇంగుటూరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు

🕐 17 Sep 2026 | 06:54 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివణ పథకం

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Zhyerabad, Sangareddy, తెలంగాణ

ఇరిగేషన్ కార్యాలయంలో ఎగిరిన త్రివర్ణ పతాకం
జహీరాబాద్, ఆర్ ఎం బి న 17
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొనిగురువారం ఉదయం జహీరాబాద్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఆ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ సి. విజయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారత దేశానికి స్వాతంత్రంసిద్దించిన పిమ్మట సెప్టెంబర్ 17, 1948 న హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనమైందని, రజాకారుల దాస్య శృంఖలాలనుండి వేరు చేసి అప్పటి భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు విముక్తిని కలిగించిందన్నారు. అయితే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 న

🕐 17 Sep 2026 | 02:14 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహణ

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Chinthalapalem, సూర్యాపేట, తెలంగాణ

చింతలపాలెం: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసిల్దార్ బి. రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఆత్రేయ, సీనియర్ అసిస్టెంట్ రంగారావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕐 17 Sep 2026 | 10:20 AM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

గణేష్ లడ్డు,4.50 లక్షలకు కైవసం చేసుకున్న టీడీపీ నేత గొట్టు, ఆదిరెడ్డి, కుటుంబం

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల , కేంద్రమైన(ఆనందపేట), సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా 50 కేజీల లడ్డుతో పాటు 10 గ్రాముల బంగారు లాకెట్ను వేలం వేశారు.: తీవ్ర పోటీ మధ్య సీనియర్ టీడీపీ నాయకుడు గొట్టు ఆదిరెడ్డి కుటుంబం రూ. 4.50 లక్షలకు ఈ లడ్డును దక్కించుకుంది.వేడుకలు: బుధవారం రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణసంచా కాల్పుల మధ్య విఘ్నేశ్వరుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును స్వామివారి సేవలకు, అన్నదాన కార్యక్రమానికి నిర్వహించారు

🕐 16 Sep 2026 | 10:17 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం.. 359 ఉద్యోగాల కల్పన

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తాజాగా 25 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ శాఖల్లో ఇప్పటివరకు 359 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ప్రత్యేక కేసుల కింద మరో 35 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు.

🕐 16 Sep 2026 | 04:49 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ.. బీసీ రిజర్వేషన్ల పెంపుతో కొత్త సందేహాలు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచే అంశంపై ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు, పంచాయతీరాజ్ చట్టం, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత కోసం రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

🕐 15 Sep 2026 | 06:30 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

పులగం బండ తండలో ఘనంగా వినాయక చవితి పూజలు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 నేరేడుచర్ల, సూర్యాపేట, తెలంగాణ

నేరేడుచర్ల మండలం పులగం బండ తండలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కంటెస్టెంట్ పిల్లుట్ల రఘు అన్న పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

🕐 15 Sep 2026 | 12:44 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి.

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 సూర్యాపేట, సూర్యాపేట, తెలంగాణ

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఈరోజు సూర్యాపేట ఎస్పీ నరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని తెలియజేశారు.

🕐 14 Sep 2026 | 08:10 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 వెల్దుర్తి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం తన సొంత గ్రామమైన కండ్లకుంటలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి వారి విగ్రహాన్ని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

🕐 14 Sep 2026 | 01:38 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

🙏 దర్శి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. Dr.గొట్టిపాటి లక్ష్మి - కడియాల లలిత్ సాగర్ 🎉

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ TDP ఇన్‌చార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 🙏🐘🌺 #VinayakaChavithi #Darsi #TDP #GotthipatiLakshmi #KadialaLalithSagar #GaneshChaturthi

🕐 13 Sep 2026 | 08:49 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

మల్లవరంలో తీవ్ర తాగునీటి ఎద్దడి: ఖాళీ కుండలతో ధర్నాకు సిద్ధమైన ప్రజలు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

రెంటచింతల మండలం మల్లవరం గ్రామం ఎస్సీ కాలనీలో తాగునీటి మోటారు పాడైపోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.: చుక్క నీటి కోసం మహిళలు, వృద్ధులు కిలోమీటర్ దూరం నడిచి పక్క పొలాల వ్యవసాయ బోర్ల నుండి నీరు తెచ్చుకుంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి కొత్త మోటారు వేసి నీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఖాళీ కుండలతో ధర్నా చేస్తామని ఎస్ సి కాలనీ వాసులు హెచ్చరించారు

🕐 13 Sep 2026 | 07:58 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

పొన్నూరులో మహిళ అనుమానాస్పద మృతి.. కుమార్తెపై బంధువుల ఆరోపణలు

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Ponnur, Guntur, ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా పొన్నూరులో 45 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. క్యాబిన్‌పేటకు చెందిన ఈవూరు లక్ష్మి తన కుమార్తె పుష్పతో కలిసి 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారని కుమార్తె చెబుతుండగా, ఆరోగ్యంగా ఉన్న ఆమె అకస్మాత్తుగా మరణించడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె తన ప్రియుడితో కలిసి లక్ష్మిని హత్య చేసి ఉండవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

🕐 12 Sep 2026 | 05:20 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

మల్లవరంలో తాగునీటి ఎద్దడి: మోటార్ రిపేర్ చేయిస్తామని ఎంపీడీవో, హామీ

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 రెంటచింతల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్

మండల పరిధిలోని మల్లవరం గ్రామం ఎస్సీ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. తాగడానికి నీరు దొరక్క కాలనీవాసులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మదర్ ఫౌండేషన్ మల్లవరంఅధ్యక్షుడు జిల్లా బాబు రావు ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎంపీడీవో, స్వరూప రాణి కి రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో. గ్రామంలో పాడైపోయిన బోర్ త్రీ ఫేస్ మోటార్‌ను తక్షణమే రిపేర్ చేయించి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా సాగర్, కిషోర్, బాబు, ఏసోబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

🕐 11 Sep 2026 | 11:46 PM 📰 Read More
RMB LIVE NEWS - India's No.1 Short News App

రేపుమార్కండేశ్వర మందిరంలో 224 వ నగర సంకీర్తన

👤 RMB News Reporter | 🌐 Telugu | 📍 Zherabad, Sangareddy, తెలంగాణ

రేపు మార్కండేశ్వర మందిరంలో 224వ నగర సంకీర్తన
జహీరాబాద్, ఆర్ఎంబి న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 11
శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ జహీరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 13న 224 వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6-15 గంటలకు హరేకృష్ణ మహామంత్ర జపం, శ్రీల ప్రభుపాదుల వారి ప్రార్థన గీతం, రసరమ్య కీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్ర, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర నిర్వహణ బాధ్యులు శ్రీ విభీషణ దాస ప్రభుజీ ద్వారా భగవద్గీతపై అనుగ్రహ భాషణం, నరసింహ ఆరతి, ప్రసాద విత

🕐 11 Sep 2026 | 10:29 AM 📰 Read More
Loading more cards...
All news loaded! 🎉
📰 1 / 25 of 175

✍️ Create News

✏️ Edit News

📰 Create Article

✏️ Edit Article

🖼️ Manage Banners

✏️ Edit Banner

📢 Manage Ads

📺 Manage Shorts