⏳ Generating...

RMB NEWS - తెలుగు షార్ట్ న్యూస్ | RMB Live News

ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏపీకి రూ.88 వేల కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీలో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.88,392 కోట్ల పెట్టుబడులతో 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కియా పరిశ్రమ విస్తరణ, అనకాపల్లిలో భారీ డేటా సెంటర్, అమరావతిలో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై కూడా కీలక చర్చ జరిగింది.

👁️ 14
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కీలక చర్చలు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కీలక చర్చలు

| 🌐 Telugu | 📍 అమరావతి, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, 2029 ఎన్నికల అమలుపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

👁️ 220
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా.. జిల్లాల వారీగా ఫలితాలు
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా.. జిల్లాల వారీగా ఫలితాలు

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హవా. జిల్లాల వారీగా ఫలితాలు- పూర్తి వివరాలు!

👁️ 322
డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ!

| 🌐 Telugu | 📍 ఢిల్లీ

కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. లోక్‌సభ నవంబర్ 30న, రాజ్యసభ డిసెంబర్ 2న సమావేశం కానున్నాయి. డిసెంబర్ 3తో సమావేశాలు ముగియనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో సవరణలతో కూడిన డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుతో ముడిపడిన ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే బిల్లు ప్రవేశపెట్టడంపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

👁️ 180
జగన్ ఇలాకాలో టీడీపీ జోరు.. సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

జగన్ ఇలాకాలో టీడీపీ జోరు.. సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవం!

| 🌐 Telugu | 📍 సింహాద్రిపురం, కడప, ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్ సొంత గ్రామంలో టీడీపీ జెండా రెపరెపలాడింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు పంచాయతీలో టీడీపీ అభ్యర్థి కొత్తరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల తర్వాత జగన్ సొంతూరిలో టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2,269 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో వైసీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకపోవడంతో అనిల్ కుమార్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది.

👁️ 30
మై టీడీపీ యాప్‌లో సరికొత్త రికార్డు.. 10 లక్షల డౌన్‌లోలోడ్స్!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

మై టీడీపీ యాప్‌లో సరికొత్త రికార్డు.. 10 లక్షల డౌన్‌లోలోడ్స్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీ రూపొందించిన మై టీడీపీ (MyTDP) యాప్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే 10 లక్షల డౌన్‌లోలోడ్స్ సాధించడం పార్టీ ప్రయాణంలో అరుదైన మైలురాయిగా నిలిచిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు నిర్వహించే కార్యక్రమాల వివరాలను మై టీడీపీ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. యాప్ ద్వారా ఇచ్చే టాస్క్‌ల ఆధారంగా కార్యకర్తల పనితీరును గుర్తించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

👁️ 376
సామాన్యుడికి సీఎం చంద్రబాబు భారీ ఊరట!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

సామాన్యుడికి సీఎం చంద్రబాబు భారీ ఊరట!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

సామాన్యులపై నిత్యావసర ధరల భారం పడకూడదని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.100కే, లీటర్ పామాయిల్ రూ.125కే విక్రయించాలని ఆదేశించారు. ధరల నియంత్రణ కేంద్రాలను 286 నుంచి 500కు పెంచాలని, కూరగాయల ధరలను కూడా నియంత్రించాలని అధికారులకు సూచించారు.

👁️ 553
విజయవాడ మేయర్‌ వంగవీటి రాధాను కలిసిన దారం సుబ్బారావు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

విజయవాడ మేయర్‌ వంగవీటి రాధాను కలిసిన దారం సుబ్బారావు!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, Andhra Pradesh

విజయవాడ మేయర్ వంగవీటి రాధా గారిని దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, యాదగిరి వాసు, కనకం శ్రీను, సైదా, దారం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

👁️ 59
దర్శి చైర్మన్ గెలుపు.. ప్రజల విజయమన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దర్శి చైర్మన్ గెలుపు.. ప్రజల విజయమన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి మున్సిపల్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన దారం సుబ్బారావు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. గత మూడేళ్లలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. దర్శిని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని, ప్రజలకు పారదర్శక పాలన అందించాలని పిలుపునిచ్చారు.

👁️ 27
దరిశి మున్సిపల్ నూతన చైర్మన్‌గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దరిశి మున్సిపల్ నూతన చైర్మన్‌గా దారం సుబ్బారావు ప్రమాణ స్వీకారం

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దరిశి మున్సిపల్ నూతన చైర్మన్‌గా జనసేన పార్టీ నాయకుడు దారం సుబ్బారావు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దరిశిలోని పొదిలి రోడ్డులో ఉన్న పీజీఎన్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన నక్కరంగ సతిమణి నక్క చంద్రతో పాటు వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితర ప్రముఖులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

👁️ 22
అక్కా, తమ్ముడికి కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం..శుభాకాంక్షలు తెలిపిన దినకర్!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

అక్కా, తమ్ముడికి కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం..శుభాకాంక్షలు తెలిపిన దినకర్!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్న మా అక్క, తమ్ముడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న దర్శి టీడీపీ నాయకులు ఇత్తడి దినకర్. 💐

👁️ 48
దారం సుబ్బారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దారం సుబ్బారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

రేపు దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావుకు టీడీపీ నాయకులు ఇత్తడి దినకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ప్రజల మన్ననలు పొందుతూ, దర్శి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. దారం సుబ్బారావు రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని ఇత్తడి దినకర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

👁️ 40
కూటమి పాలనలో పల్లెలకు మహర్దశ!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

కూటమి పాలనలో పల్లెలకు మహర్దశ!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడిన పల్లెల్లో ఇప్పుడు రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, మహిళలకు భద్రత, రైతులకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ పల్లెల రూపురేఖలు మార్చే దిశగా ముందుకు సాగుతోంది.

👁️ 43
బంగాళాఖాతంలో మరో తుఫాన్...
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

బంగాళాఖాతంలో మరో తుఫాన్...

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 5 తుఫాన్లు ఏర్పడుతాయని, ఈసారి ఇప్పటికే 3 తుఫాన్లు తీరాన్ని తాకాయని వెల్లడించారు. డిసెంబర్ 2లోగా నాలుగో తుఫాన్ ఏర్పడవచ్చని తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ రెండో వారంలో మరో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని, దాని తీవ్రత, దిశపై ఇప్పుడే స్పష్టత లేదని పేర్కొన్నారు.

👁️ 406
పర్చూరులో కూటమి హవా.. 31 మంది సర్పంచులు ఏకగ్రీవం!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

పర్చూరులో కూటమి హవా.. 31 మంది సర్పంచులు ఏకగ్రీవం!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకత్వంలో ఆరు మండలాల్లో 31 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం మండలాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన సర్పంచులకు ఎమ్మెల్యే ఏలూరి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.

👁️ 78
అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ!😍
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ!😍

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

చెన్నైలో అనిరుధ్ రవిచందర్ – కావ్య మారన్ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్, మాజీ సీఎం స్టాలిన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. రజనీకాంత్‌తో లోకేష్ ఆప్యాయంగా ముచ్చటించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

👁️ 106
దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావుకు RMB News శుభాకాంక్షలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావుకు RMB News శుభాకాంక్షలు!

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, Andhra Pradesh

ఈ నెల 23వ తేదీన దర్శి మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న దారం సుబ్బారావు గారికి RMB News మేనేజింగ్ డైరెక్టర్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన బాధ్యతల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, దర్శి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాం.
ఇట్లు.. RMB News మేనేజింగ్ డైరెక్టర్. 💐

👁️ 70
దర్శిలో ఘనంగా మాజీ మున్సిపల్ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

దర్శిలో ఘనంగా మాజీ మున్సిపల్ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం

| 🌐 Telugu | 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్

దర్శి పురపాలక సంఘం 2021–2026 పాలకవర్గ ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మాజీ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నూతన చైర్మన్ దారం సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, కమిషనర్ కె. అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

👁️ 79
బియ్యం ధరలకు బ్రేక్‌.. తగ్గిన ధరలు ప్రభుత్వం కీలక నిర్ణయం
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

బియ్యం ధరలకు బ్రేక్‌.. తగ్గిన ధరలు ప్రభుత్వం కీలక నిర్ణయం

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీలో బియ్యం ధరలకు బ్రేక్‌.. మిల్లర్లు, వ్యాపారులకు కొత్త నిబంధనలు. ఏపీలో బియ్యం ధరలు, నిల్వలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మిల్లర్లు, వ్యాపారులకు స్టాక్ పరిమితులు విధిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ ఎంటీయూ బియ్యం కిలో రూ.47గా నిర్ణయించగా, ఇతర రకాల ధరలు రూ.66 నుంచి రూ.82 వరకు ఉన్నాయి. స్టాక్ వివరాలను ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు దుకాణాల్లో ధరల పట్టికలు ప్రదర్శించాలని ఆదేశించింది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే జరిమానాలు విధించనుంది.

👁️ 456
మార్టూరులో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి 30 కుటుంబాలు!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

మార్టూరులో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి 30 కుటుంబాలు!

| 🌐 Telugu | 📍 Marturu, Bapatla, ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల వేళ బాపట్ల జిల్లా మార్టూరులో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఉపసర్పంచ్ కాకోలు రామారావుతో పాటు వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు ఆయన తెలిపారు.

👁️ 38
గొట్టిపాటి లక్ష్మీ ఇంటి వేడుక.. నేతల సందడి!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

గొట్టిపాటి లక్ష్మీ ఇంటి వేడుక.. నేతల సందడి!

| 🌐 Telugu | 📍 నరసరావుపేట, ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డా. గొట్టిపాటి లక్ష్మి, డా. లలిత్ సాగర్ దంపతుల కుమారుడి నూతన వస్త్ర బహూకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

👁️ 116
జడ్పీ ఛైర్మన్లపై కూటమి కసరత్తు..
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

జడ్పీ ఛైర్మన్లపై కూటమి కసరత్తు..

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీ జెడ్పీ చైర్మన్ ఎన్నికల వేళ కూటమిలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నివాసంలో నేతల భేటీతో జడ్పీ ఛైర్మన్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది.

👁️ 523
జనసేనలో అనంత శ్రీరాం తల్లిదండ్రులు.. సర్పంచ్ బరిలో తల్లి ఉమారాణి!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

జనసేనలో అనంత శ్రీరాం తల్లిదండ్రులు.. సర్పంచ్ బరిలో తల్లి ఉమారాణి!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరాం కుటుంబంలో రాజకీయ సందడి మొదలైంది. ఆయన తల్లిదండ్రులు జనసేన పార్టీలో చేరారు. భీమవరంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. తన తల్లి ఉమారాణి దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అనంత శ్రీరాం వెల్లడించారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థతో పాటు అభివృద్ధి పనులు చేపట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని పార్టీల మద్దతుతో ఉమారాణి ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

👁️ 34
జర్నలిస్టులను ఘనంగా సన్మానించిన భీమ్ ఆర్మీ..
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

జర్నలిస్టులను ఘనంగా సన్మానించిన భీమ్ ఆర్మీ..

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

జాతీయ జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని ఆర్ఎంబి న్యూస్ 16 భీమ్ ఆర్మీ కార్యాలయంలో పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ రావణ్ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలతో గౌరవించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా పనిచేసే పాత్రికేయులను గుర్తించి గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు.

👁️ 53
ఏపీకి తుఫాన్ ముప్పు.. నవంబర్ 19న అతి తీవ్ర తుఫాన్!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏపీకి తుఫాన్ ముప్పు.. నవంబర్ 19న అతి తీవ్ర తుఫాన్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 720 కి.మీ., విశాఖపట్నానికి 820 కి.మీ. దూరంలో ఇది కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి తుఫాన్‌గా, రేపటికి తీవ్ర తుఫాన్‌గా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

👁️ 81
📰 25 / 350

🔐 RMB News Login